టాప్ సీడ్‌కు సాకేత్ జంట షాక్ | ATP challenger tournament | Sakshi
Sakshi News home page

టాప్ సీడ్‌కు సాకేత్ జంట షాక్

Feb 18 2015 12:22 AM | Updated on Sep 2 2017 9:29 PM

టాప్ సీడ్‌కు సాకేత్ జంట షాక్

టాప్ సీడ్‌కు సాకేత్ జంట షాక్

ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలంగాణ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ విభాగంలో సంచలనం సృష్టించాడు.

 ఏటీపీ చాలెంజర్ టోర్నీ
 న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలంగాణ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ విభాగంలో సంచలనం సృష్టించాడు.  సనమ్ సింగ్ (భారత్)తో కలిసి తొలి రౌండ్‌లో టాప్ సీడ్ జంట ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) -పురవ్ రాజా (భారత్)కు షాక్ ఇచ్చాడు.
 
 
  66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్-సనమ్ సింగ్ జంట 6-4, 7-5తో మార్టిన్-పురవ్ రాజాలను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగి ల్స్‌లో భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ, సోమ్‌దేవ్,  రామ్‌కుమార్, సనమ్ సింగ్ రెండో రౌండ్‌కి చేరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement