Sakshi News home page

గెలిస్తే... మరో చరిత్రే!

Published Fri, Nov 4 2016 11:48 PM

గెలిస్తే... మరో చరిత్రే! - Sakshi

ఇరాక్ క్లబ్‌తో బెంగళూరు ఎఫ్‌సీ అమీతుమీ
ఏఎఫ్‌సీ కప్ ఫైనల్ నేడు

దోహా: ఆసియాకు చెందిన ఫుట్‌బాల్ క్లబ్ జట్లు తలపడే ఏఎఫ్‌సీ కప్‌లో ఓ భారతీయ క్లబ్ బెంగళూరు ఎఫ్‌సీ ఘన చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉంది. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరి ఇప్పటికే రికార్డులకెక్కిన బెంగళూరు ఎఫ్‌సీ ఇప్పుడు టైటిల్ పోరుకు సిద్ధమైంది. శనివారం ఇరాక్‌కు చెందిన ఎరుుర్ ఫోర్స్ క్లబ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటిదాకా ఈస్ట్ బెంగాల్ క్లబ్ (2013లో), డెంపో (2008లో) సెమీస్ చేరడమే రికార్డరుుతే...

దీన్ని సునీల్ చెత్రి నేతృత్వంలోని బెంగళూరు ఎఫ్‌సీ అధిగమించింది. అరుుతే పటిష్టమైన ఇరాక్ క్లబ్‌ను ఎదుర్కోవాలంటే బెంగళూరు ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డాల్సిందే. ఎందుకంటే ఈ జట్టులో జాతీయ జట్టు స్టార్ ఆటగాళ్లు నలుగురు బరిలోకి దిగుతారు. ఈ టోర్నీలో ఎరుుర్‌ఫోర్స్ క్లబ్ ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట గెలుపొందింది. ఖతార్ స్పోర్‌‌ట్స క్లబ్ స్టేడియంలో రాత్రి 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్‌‌ట్స-1 చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement