హెచ్‌సీఏ ఇంటర్ స్కూల్/ కాలేజ్ టోర్నమెంట్‌లో సరూర్‌నగర్ జడ్పీహెచ్ పాఠశాలకు చెందిన అనిత అర్ధశతకంతో సత్తా చాటింది.
హెచ్‌సీఏ బాలికల క్రికెట్ టోర్నమెంట్
హైదరాబాద్: హెచ్‌సీఏ ఇంటర్ స్కూల్/ కాలేజ్ టోర్నమెంట్‌లో సరూర్‌నగర్ జడ్పీహెచ్ పాఠశాలకు చెందిన అనిత అర్ధశతకంతో సత్తా చాటింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అనిత (53), కల్పన (33) రాణించడంతో ఆ జట్టు కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జడ్పీహెచ్‌ఎస్ 10 ఓవర్లలో 129 పరుగులు చేసింది. అనంతరం కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 10 ఓవర్లలో 7 వికెట్లకు 41 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.
ఇతర మ్యాచ్‌ల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (35/6; 10 ఓవర్లలో), ఇండస్ యూనిర్సల్ పాఠశాల (36/1; 2.5 ఓవర్లలో) చేతిలో ఓడిపోగా... జడ్పీహెచ్‌ఎస్ (50/1; 3.3 ఓవర్లలో), మిడ్‌వెస్ట్ ఇండియన్స్ హైస్కూల్ (48/3)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఇండస్ యూనివర్సల్ పాఠశాల (100/3; 10 ఓవర్లలో), మిడ్‌వెస్ట్ ఇండియన్ హైస్కూల్ (44/1; 10 ఓవర్లలో)పై గెలుపొందింది.