దుమ్మురేపిన షఫీఖుల్లా | Afghanistan won match against with Hong Kong team | Sakshi
Sakshi News home page

దుమ్మురేపిన షఫీఖుల్లా

Mar 19 2014 1:12 AM | Updated on Mar 28 2019 6:10 PM

దుమ్మురేపిన షఫీఖుల్లా - Sakshi

దుమ్మురేపిన షఫీఖుల్లా

షహజాద్ (53 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), షఫీఖుల్లా (24 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ 7 వికెట్ల తేడాతో హాంకాంగ్‌ను చిత్తు చేసింది.

అఫ్ఘానిస్థాన్ విజయం
 హాంకాంగ్ ఆశలు గల్లంతు
 టి20 ప్రపంచకప్ అర్హత టోర్నీ
 
 చిట్టగాంగ్: షహజాద్ (53 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), షఫీఖుల్లా (24 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ 7 వికెట్ల తేడాతో హాంకాంగ్‌ను చిత్తు చేసింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో తొలుత హాంకాంగ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది.
 
 చాప్‌మన్ (43 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్సర్), వకాస్ (32 బంతుల్లో 32; 3 ఫోర్లు) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్థాన్ 18 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. నజీబ్ (7), అస్గర్ (13) విఫలమైనా... షహజాద్, షఫీఖుల్లా చెలరేగిపోయారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. రెండో ఓటమితో హాంకాంగ్ ప్రధాన టోర్నీకి అర్హత పొందే అవకాశాలు ఆవిరయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement