‘నక్కా ఆనంద్‌, కారెం శివాజిలు.. చంద్రబాబు చప్రాసీలు’

YSRCP SC Cell President Merugu Nagarjuna Fires On Nakka Anand Babu And Karem Sivaji - Sakshi

సాక్షి, విజయవాడ : దళితుల పేరుతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురించి కారుకూతులు కూస్తే సహించేది లేదంటూ వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున హెచ్చరించారు. బుధవారం వైయస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న నాగార్జున వైఎస్‌ జగన్‌పై దాడి విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు అనైతికంగా మాట్లాడుతూ పశువుల మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. నక్కా ఆనంద్‌ బాబు, కారెం శివాజి, జవహర్‌లు దళితులైనంతా మాత్రాన వైఎస్‌ జగన్‌ గురించి ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు.

దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకోరన్న చంద్రబాబు వద్ద పని చేస్తూ వైఎస్‌ జగన్‌ను అరెస్ట్‌ చేస్తామని చెబుతున్నారు.. మీకు అంత సత్తా ఉంటే అరెస్ట్‌ చేయించండంటూ సవాల్‌ విసిరారు. వైఎస్‌ జగన్‌ను చంపడానికి విజయమ్మ, షర్మిల ప్లాన్‌ చేశారని ఏకలవ్యుడు లాంటి నేతలు ఆరోపిస్తున్నారు.. మీ నోట్లో ఏమన్నా అశుద్దం పోసుకున్నారా అంటూ మేరుగు తీవ్రంగా ధ్వజమెత్తారు. నక్కా ఆనంద్‌, కారెం శివాజి, జవహర్‌లు దళితులని వారి చేత వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేయిస్తున్నారు. దళితుల పేరుతో మా నాయకుడి గురించి కారు కూతలు కూస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. అంబేడ్కర్‌ దయతో పదవులు పొందిన మీరు చంద్రబాబు దగ్గర చప్రాసీ ఉద్యోగం చేస్తున్నారంటూ విమర్శించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి తెగబలిసి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతపై జరిగిన దాడి పట్ల టీడీపీ నేతలు దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ.. నిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తూ ముందుకు వెళ్తున్న ప్రజానాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయించే సత్తా టీడీపీ నేతలకు లేదని వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ చమట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను, ఎంపీలను చంద్రబాబు సంతలో పశువుల్లా కొన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దమ్ముంటే మీ రాజీనామాలను చంద్రబాబు ముఖాన విసిరేసి ప్రజాక్షేత్రంలోకి రండి. అంతేకానీ దళితులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టొద్దని కోరారు. మీరు ఎన్ని ఆరోపణలు చేసిన ఒక్క దళితుడు కూడా వైఎస్‌ జగన్‌ నుంచి పక్కకు వెళ్లరని మేరుగు ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top