టీడీపీ ఎంపీలు సైతం రాజీనామా చేయాలి: వైవీ సుబ్బారెడ్డి | YSRCP MP YV Subba Reddy Slams TDP MPs | Sakshi
Sakshi News home page

Mar 26 2018 8:30 PM | Updated on Mar 23 2019 9:10 PM

YSRCP MP YV Subba Reddy Slams TDP MPs - Sakshi

వైవీ సుబ్బారెడ్డి

సాక్షి, ప్రకాశం : హోదాపై చిత్తశుద్ది ఉంటే టీడీపీ ఎంపీలు సైతం రాజీనామాలు చేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ నుంచి ఐదుగురు ఎంపీలే ఉన్నా చిత్తశుద్ధితో హోదాపై పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నామన్నారు. టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.

తమ అధినేత సూచనల మేరకు పార్లమెంట్‌ నిరవధిక వాయిదా పడిన రోజే ఏంపీ పదవులకు రాజీనామాలు చేస్తామని స్పష్టం చేశారు.  హోదాపై చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎంపీలు రాజీనామాల విషయంలో తమతో కలిసి రావాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement