‘బాబు.. ఆ విషయాన్ని ఎవరూ మర్చిపోరు’ | YSRCP MP Vijay Sai Reddy Criticize Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు.. ఆ విషయాన్ని ఎవరూ మర్చిపోరు

Published Sun, Oct 13 2019 10:23 AM | Last Updated on Mon, Oct 14 2019 2:15 PM

YSRCP MP Vijay Sai Reddy Criticize Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ ​కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్‌ వేదికగా విరుచుకుపడ్డారు. గతంలో ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయనతో విబేధాలు లేవంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. ‘మోదీ రాక్షసుడు, దేశానికి పట్టిన శని, భార్యను వదిలేసిన బాధ్యత లేని వ్యక్తి అని అనేక రకాలుగా దూషించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయనతో వ్యక్తిగత విభేదాలేమీ లేవని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. మోదీని గద్దె దింపడం కోసమే కాంగ్రెస్ తో చేతులు కలిపినట్టు చెప్పిన విషయాన్ని ఎవరూ మర్చిపోరు చంద్రబాబు నాయుడు’  అని విజయసాయిరెడ్డి ట్విట్‌ చేశారు. 

చీకటి పొత్తు గ్రహించే గుణపాఠం చెప్పారు
హుందాగా ఉండాలనే జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసిన గాజువాకలో ప్రచారానికి వెళ్లదట చంద్రబాబు నాయుడు. పవన్‌ కల్యాణ్‌ కూడా హుందాగానే మాలోకం నిలబడిన మంగళగిరి మొహం చూడలేదేమో. ఆ విధంగా వారిద్దరు పార్టనర్లమని బయటపెట్టుకున్నారు. చీకటి పొత్తుల విషయాన్ని ప్రజలు గ్రహించారు కాబట్టే గట్టి గుణపాఠం చెప్పారు’ అని విజయసాయిరెడ్డి మరో ట్విట్‌ చేస్తూ చంద్రబాబును విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement