బాబు సీఎం కుర్చీపై ఆశలు వదులుకో..

ysrcp mla narayanaswamy calls on party leaders in hospital - Sakshi

సాక్షి, పెనుమూరు: చంద్రబాబు సీఎం కుర్చీపై పెట్టుకున్న ఆశలు వదులుకోవాలని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నారాయణస్వామి సూచించారు. శుక్రవారం ఆయన పెనుమూరు మండలం చిప్పారపల్లెలో స్థానిక విలేకర్లతో మాట్లాడారు.  జూన్‌ 8 వరకు తానే సీఎం అని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఆ తర్వాత తాను ముఖ్యమంత్రి కాదని ఆయనే ఒప్పుకున్నారని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెనుమూరు మండలంలో టీడీపీ నేతల భూ ఆక్రమణలపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామన్నారు.

ఎన్నికల రోజు పెనుమూరులో వైఎస్సార్‌ సీపీ నాయకులపై టీడీపీ నేతలు మారణాయుధాలతో దాడి చేసిన పోలీసులు తూతూ మంత్రంగా కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. పోలీసులు తీరుకు వ్యతిరేకంగా పెనుమూరులో త్వరలో ధర్నా చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. చిత్తూరు మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో 35 వేలు నుంచి 40 వేల మెజార్టీతో నారాయణస్వామి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని చెప్పారు. 

బాధితులకు పరామర్శ
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతల దాడిలో గాయపడిన కారేటి సురేష్, కంచర్ల చక్రవర్తినాయుడిని శుక్రవారం చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డితో కలిసి ఎమ్మెల్యే నారాయణస్వామి పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top