‘రైతు దినోత్సవాన్ని ఏపీ సర్కార్‌ మర్చిపోయింది’ | YSRCP Leader Nagi Reddy Fires On Chandrababu Naidu Over Farmers Issue | Sakshi
Sakshi News home page

Dec 23 2018 4:26 PM | Updated on Dec 23 2018 4:41 PM

YSRCP Leader Nagi Reddy Fires On Chandrababu Naidu Over Farmers Issue - Sakshi

సాక్షి, కర్నూలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి మండిపడ్డారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ సర్కార్‌ జాతీయ రైతు దినోత్సవాన్ని మర్చిపోయిందని అన్నారు. ఏపీలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాలుగున్నర సంవత్సర పాలన కాలంలో నాలుగు కరువులు, ఐదు తుపాన్లతో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. 

రాష్ట్రంలో రైతులు పరిస్థితి దయనీయంగా ఉంటే చంద్రబాబు మాత్రం వ్యవసాయంలో ఏపీ రెండంకెల స్థానంలో ఉందని ప్రజలను మభ్యపెట్టేందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌, రుణమాఫీ హామీలతో చంద్రబాబు రైతులను తీవ్రంగా మోసం చేశారని వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement