ఎవరిదైనా పర్వాలేదు.. రాష్ట్రం ముఖ్యం: వైఎస్‌ జగన్‌ | For YSRCP, Interest Of AP And Its People Is Paramount : YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌ సీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: వైఎస్‌ జగన్‌

Mar 16 2018 2:28 PM | Updated on Mar 23 2019 9:10 PM

For YSRCP, Interest Of AP And Its People Is Paramount : YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర, ప్రజల ప్రయోజనాలే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత ముఖ్యమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టినా తాము మద్దతు ఇస్తామని చెప్పారు. మిగతా ఏ పార్టీతో పోల్చుకున్నా తాము రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తామని, అందుకోసం ఏం చేసేందుకుకైనా సిద్ధం అని స్పష్టం చేశారు. శుక్రవారం ఈ మేరకు ట్వీటర్‌లో స్పందించిన ఆయన ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిన కేంద్ర ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని, అయితే, సభలో ఎవరిది పరిగణనలోకి తీసుకొని చర్చిస్తారనేది అంత ముఖ్యమైన అంశం కాదని, ఆంధ్రప్రదేశ్‌ పౌరుల హక్కులకు హామీ లభించిందా..? రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిందా అన్నదే ముఖ్యం అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.

'ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర, ప్రజల ప్రయోజనాలే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి అత్యంత ముఖ్యం.. అన్ని రాజకీయ పార్టీలకు ఈ అంశం అతీతం. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా ఎవరిది పరిగణలోకి తీసుకుంటారనేది అంత ముఖ్యమైన అంశంకాదు. ఆంధ్రప్రదేశ్‌ పౌరుల హక్కులకు హామీ దొరికిందా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిందా అన్నదే ముఖ్యం' అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాసం తీర్మానంపై నోటీసులు ఇవ్వగా దానిపై సోమవారం చర్చిస్తామని లోక్‌సభ స్పీకర్‌ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి అవిశ్వాస తీర్మానంపై నోటీసులు ఇవ్వాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. అదే సమయంలో టీడీపీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని కూడా స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement