వైఎస్ షర్మిల బస్సు యాత్ర ప్రారంభం | ys sharmila bus yatra starts in Tadepalli | Sakshi
Sakshi News home page

వైఎస్ షర్మిల బస్సు యాత్ర ప్రారంభం

Mar 29 2019 4:03 PM | Updated on Mar 29 2019 8:06 PM

ys sharmila bus yatra starts in Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి, పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిల శుక్రవారం తాడేపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి బస్సు యాత్ర ఆరంభించిన ఆమె... అనంతరం పట్టణంలోని ప్రభుత్వ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని బోటుయార్డు భూ సమీకరణ బాధిత రైతులతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటారు. అక్కడ నుంచి ఉండవల్లి సెంటర్‌లో పార్టీ కార్యకర్తలను కలుసుకుంటారు.

అనంతరం పట్టణంలోని సాయిబాబా మందిరం సమీపంలోని బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద పసుపు రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటారు. అక్కడ నుంచి నులకపేట మీదుగా డోలాస్‌నగర్‌ చేరుకుని అక్కడ మహిళా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత మంగళగిరి పట్టణానికి చేరుకుని, సాయంత్రం ఐదు గంటలకు పాతబస్టాండ్‌ సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 



 

Advertisement
 
Advertisement
Advertisement