
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 మంది ఎంపీలూ రాజీనామాలు చేసి ఉంటే, ఆ ఫలితంగా ఉపఎన్నికలు వచ్చేదుంటే.. ప్రత్యేక హోదాపై ప్రజలు తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పే అవకాశం ఉండేదని, ఇది తెలిసి కూడా చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామాలు చేయించకపోవడం మోసమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో చంద్రబాబుకు ప్రశ్నలు సంధించింది.
ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా రాజీనామాలు చేయకుండా, కుంటిసాకులు చెబుతోన్న టీడీపీ నేతలను ఎక్కడిక్కడే నిలదీయాలని వైఎస్సార్‌సీపీ పిలుపిచ్చింది. ప్రత్యేక హోదా విషయంలో గడిచిన నాలుగేళ్లుగా పూటకో మాట చెబుతూ మోసంచేసి, ఇప్పుడు తామే పోరాడుతున్నట్లు మభ్యపెట్టేయత్నం చేస్తోన్న టీడీపీకి ప్రజలు బుద్ధిచెప్పాలని కోరారు.
బాబుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలు#YSRCPMPsFastforAPSCS #JaiAndhraPradesh pic.twitter.com/5QROIyGq0B
— YSR Congress Party (@YSRCParty) 9 April 2018