మాకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదు: రాంమాధవ్‌

We will play the role of an efficient opposition in Ap, says Ram madhav - Sakshi

సాక్షి, విజయవాడ:  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సహకరించేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ తెలిపారు. నగరంలో బీజేపీ సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంమాధవ్‌ మాట్లాడుతూ.. ‘సామాన్య ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలు అందేలా చేస్తాం. ఏపీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం. తన పార్టీ నుంచి వలసలను ఆపేందుకు బీజేపీతో పొత్తు గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు పరిస్థితి ఆకులు కాలాక చేతులు పట్టుకున్న చందంగా ఉంది. మాకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం. రాష్ట్రంలో ఏ పార్టీకి జూనియర్‌ పార్టీగా వ‍్యవహరించం.’ అని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top