విశాఖలో రాజధాని ఏర్పాటుకు మద్దతిస్తున్నా

రాజధానిగా విశాఖ అన్నివిధాల అనువైన నగరం
బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటుకు తాను మద్దతునిస్తున్నట్టు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు స్పష్టం చేశారు. రాజధానిగా విశాఖ అన్ని విధాల అనువైన నగరమన్నారు. అమరావతి రాజధానికి పనికిరాదని శివరామకృష్ణన్ కమిటీ గతంలోనే చెప్పిందని ఆయన గుర్తు చేశారు. రాజధానిగా అమరావతి వద్దని చెప్పినా అప్పటి సీఎం చంద్రబాబునాయుడు పట్టించుకోలేదని విమర్శించారు. రాజధాని వ్యవహారంలో ఇప్పుడు చంద్రబాబు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని విష్ణుకుమార్‌రాజు స్పష్టం చేశారు.
చదవండి : అమరావతి.. విఫల ప్రయోగమే
మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!
బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి