తీవ్రంగా నిరాశపరిచారు: తమ్మినేని | Tammineni Sitaram comments on Union Budget | Sakshi
Sakshi News home page

తీవ్రంగా నిరాశపరిచారు: తమ్మినేని

Feb 2 2018 12:41 PM | Updated on May 29 2018 4:40 PM

Tammineni Sitaram comments on Union Budget - Sakshi

వైఎస్సార్‌సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం

సాక్షి, శ్రీకాకుళం: కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ అన్నివర్గాల ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందని వైఎస్సార్‌సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ బడ్జెట్ పరిష్కరం చూపలేదని అన్నారు. ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. దేశంలో ఉద్యోగ విప్లవం రావాలని, లేదంటే యువత అసాంఘిక శక్తులవైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

రైల్వేజోన్, ప్రత్యేకహోదా గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడూ కేంద్రాన్ని కోరలేదని ఆరోపించారు. విభజన చట్టంలోని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను, ప్రయోజనాలను రాబట్టడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని తమ్మినేని ధ్వజమెత్తారు. కాగా, గురువారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శలు వస్తున్నాయి. మొక్కుబడిగా కేటాయింపులు జరిపారని ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement