చంద్రబాబు ఎవరికి భరోసా ఇచ్చారు?

Talasani srinivas about chandrababu naidu - Sakshi

మంత్రి తలసాని

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌ గూటికి చేరిన నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీరుపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు.

కార్యకర్తల్లో మనోధైర్యం నింపే ఉద్దేశంతో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో గురువారం నిర్వహించిన టీడీపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంపై అసెంబ్లీలోని తన చాంబర్‌లో తలసాని మాట్లాడుతూ.. ‘చంద్రబాబు అసలు ఎవరికి భరోసా ఇచ్చాడు? పార్టీని వీడివెళ్లిన రేవంత్‌రెడ్డి పేరును కనీసం ప్రస్తావించాడా? ఆయన వెళ్లిపోయినా ఏం కాదని కార్యకర్తలకు ధైర్యం నూరిపోసిండా? పాత సోదంతా చెప్పడం తప్పితే సమావేశంతో ఒరిగింది ఏమిటి..?’అని వ్యాఖ్యానించారు.

రేవంత్‌ తన రాజీనామా లేఖను నేరుగా స్పీకర్‌కు ఇవ్వకుండా పార్టీ అధ్యక్షుడికి ఇచ్చారని, ఆ అధ్యక్షుడు స్పీకర్‌కు పంపలేదని చెప్పారు. తన రాజీనామాపై మాట్లాడుతూ.. తన రాజీనామా లేఖ స్పీకర్‌ వద్ద ఉందని, అయినా టీడీఎల్పీ టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనమయ్యాక తన రాజీనామా అప్రస్తుతమని మంత్రి పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top