చిన రాజప్పకు చంద్రబాబు హ్యాండ్‌..! | Shock to Deputy CM China Rajappa Over Peddapuram Ticket | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం సీటుకు ఎసరు..!

Mar 13 2019 4:04 PM | Updated on Mar 13 2019 6:56 PM

Shock to Deputy CM China Rajappa Over Peddapuram Ticket - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నేతలకు తీవ్ర అవమానం ఎదురవుతోంది. ఇప్పటికే మంత్రులు గంటా శ్రీనివాసరావు, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు టికెట్ల కేటాయింపు విషయంలో టీడీపీ అధిష్టానం వ్యవహరించిన తీరు.. ఆయా నేతల అనుచరుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఇప్పుడు ఏకంగా ఉపముఖ్యమంత్రి చిన రాజప్ప సీటుకే  ఎసరు పరిస్థితి కనిపిస్తోంది. చిన రాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గం సీటు విషయంలో కొత్త పేరు తెరపైకి వచ్చింది.

బొడ్డు  భాస్కర రామారావుకు పెద్దాపురం నుంచి టికెట్‌ ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భాస్కర రామారావును అమరావతికి పిలువడంతో.. ఆయనకు సీటు ఖరారైందని పార్టీ వర్గాల్లో  చర్చ జరుగుతోంది. దీంతో డిప్యూటీ సీఎం చిన రాజప్పకు చంద్రబాబు హ్యాండ్‌ ఇచ్చారని, ఆయనకు టీడీపీ టికెట్‌ లేనట్టేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు తన సీటు వేరే వ్యక్తికి కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారని తెలియడంతో ఆందోళన చెందిన చిన రాజప్ప హుటాహుటిన అమరావతికి బయలుదేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement