
సాక్షి, విశాఖపట్నం : రిటైర్డ్ డీఐజీ చంద్రగిరి ఏసురత్నం ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రోలో భాగంగా విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి రిటైర్డ్ డీఐజీ చంద్రగిరిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు 1500 మంది పార్టీలో చేరారు. వైఎస్ జగన్ 268వ రోజు పాదయాత్ర భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల్లోని ఆనందపురం, పెందుర్తి మండలాల పరిధిలో కొనసాగుతోంది.