రాజీనామా చేసి పార్టీ మారండి | Resign and change the party | Sakshi
Sakshi News home page

రాజీనామా చేసి పార్టీ మారండి

Mar 4 2019 2:12 PM | Updated on Mar 4 2019 2:13 PM

Resign and change the party - Sakshi

మాట్లాడుతున్న నాగమణి


అశ్వారావుపేటరూరల్‌: కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు వారి పదవులకు రాజీనామా చేసి పార్టీ మారాలని టీపీసీసీ మహిళా జనరల్‌ సెక్రటరీ సున్నం నాగమణి అన్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని నమ్మి ఓట్లు వేశారని, కానీ కొంతమంది ప్రజల నమ్మకాన్ని అధికార పార్టీకి అమ్ముకుంటూ, స్వలాభాల కోసమే ఆ పార్టీలోకి వెళ్తున్నట్లు ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హాయంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజనులకు దాదాపు 3లక్షల ఎకరాలకు పోడు పట్టాలు అందాయని అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఒక్క ఎకరానికి కుడా పట్టా ఇవ్వలేదన్నారు. హరితహారం పథకం పేరుతో గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములను బలవంతంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement