‘ఆమె’కే జెడ్పీ చాన్స్‌

Reservation ForWomen Allotted For Local Bodies Election - Sakshi

సాక్షి,సిద్ధిపేట్‌: ఇంతకాలం ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్న పలువురు కొత్త జిల్లా పరిషత్‌ పీఠంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. మొత్తం 22 మండలాల్లో అక్కన్నపేట జెడ్పీటీసీ, ఎంపీపీ రెండు ఎస్టీకి రిజర్వ్‌ చేశారు. బెజ్జంకి, కొమురవెల్లి, మిరుదొడ్డి, గజ్వేల్‌ ఎస్సీలకు కేటాయించారు. మిగిలిన వాటిలో రాయప్రోలు, కొండపాక, వర్గల్, మర్కుక్, ములుగు, చేర్యాల బీసీలకు కేటాయించగా మిగిలిన 11 స్థానాలు  జనరల్‌కు కేటాయించారు.

జనరల్‌ స్థానాలతోపాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళ, జనరల్‌ స్థానాల్లో కూడా మహిళలను పోటీలో దింపి జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవికి పోటీ పడే అవకాశం ఉంది. 22 మండలాలతో ఏర్పడిన ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని కొంత భాగంతోపాటు కరీంనగర్, వరంగల్‌ జిల్లాల నుంచి పలు మండలాలతో సిద్దిపేట జిల్లా ఆవిర్భవించింది. అయితే జిల్లా పరిషత్‌ పీఠం కోసం ప్రాంతాల వారిగా కూడా పోటీ పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. 

సతులను పోటీలో దింపనున్న పతులు 
జిల్లా పరిషత్‌ పీఠం జనరల్‌ మహిళకు కేటాయించడంతో ఇప్పటికే ఆ స్థానం కోసం పోటీ పడుతున్న నాయకులు తమ సతులను పోటీలో దింపేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తోపాటు వివిధ పార్టీల నుండి టికెట్‌ ఆశించి భంగపడిన నాయకులు,  ఓటమి పాలైన నాయకులు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ముందుగా జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉండగా.. జెడ్పీటీసీ సభ్యుల రిజర్వేషన్ల ఆధారంగా ఏ మండలం నుండి తమ సతులను లేదా కుటుంబ సభ్యులను పోటీలో దింపితే బాగుంటుందనే దానిపై దృష్టి పెడుతున్నారు. ఏదిఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికల వేడి తగ్గక ముందే పార్లమెంట్, ఆ వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలతో మరోసారి జిల్లాలోని పల్లెలు హోరెత్తనున్నాయి.  

జిల్లాలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీల రిజర్వేషన్లు ఇలా.. 

మండలం   జెడ్పీటీసీ సభ్యులు     ఎంపీపీ    
1 అక్కన్నపేట  ఎస్టీ(మహిళ)     ఎస్టీ( మహిళ)
2 బెజ్జంకి   ఎస్సీ(మహిళ)    ఎస్సీ( జనరల్‌)
3 గజ్వేల్‌  ఎస్సీ(జనరల్‌)    ఎస్సీ(మహిళ)
4 కొమురవెల్లి   ఎస్సీ(జనరల్‌)      ఎస్సీ( మహిళ)
5 మిరుదొడ్డి    ఎస్సీ(మహిళ)     ఎస్సీ(జనరల్‌)
6 రాయప్రోలు   బీసీ(జనరల్‌)  బీసీ( జనరల్‌)
7 కొండపాక   బీసీ(మహిళ)    బీసీ(మహిళ)
8 వర్గల్‌   బీసీ( జనరల్‌)   బీసీ(మహిళ)
9 మర్కూక్‌  బీసీ(మహిళ) బీసీ(జనరల్‌)
10 ములుగు  బీసీ(మహిళ)  బీసీ(మహిళ)
11 చేర్యాల  బీసీ(జనరల్‌)   బీసీ( జనరల్‌)
12 జగదేవ్‌పూర్‌  అన్‌రిజర్వుడ్‌ అన్‌రిజర్వుడ్‌
13 చిన్నకోడూర్‌   అన్‌రిజర్వుడ్‌(మహిళ)   అన్‌రిజర్వుడ్‌
14 నంగునూరు  అన్‌రిజర్వుడ్‌(మహిళ)   అన్‌రిజర్వుడ్‌(మహిళ)
15 తొగుట అన్‌రిజర్వుడ్‌  అన్‌రిజర్వుడ్‌(మహిళ)
16 సిద్దిపేటఅర్బన్‌   అన్‌రిజర్వుడ్‌(మహిళ)    అన్‌రిజర్వుడ్‌(మహిళ)
17 సిద్దిపేట రూరల్‌   అన్‌రిజర్వుడ్‌   అన్‌రిజర్వుడ్‌
18 కోహెడ   అన్‌రిజర్వుడ్‌(మహిళ)  అన్‌రిజర్వుడ్‌(మహిళ)
19 దుబ్బాక   అన్‌రిజర్వుడ్‌    అన్‌రిజర్వుడ్‌
20 దౌల్తాబాద్‌  అన్‌రిజర్వుడ్‌(మహిళ)   అన్‌రిజర్వుడ్‌(మహిళ) 
21 మద్దూరు  అన్‌రిజర్వుడ్‌  అన్‌రిజర్వుడ్‌
22 హుస్నాబాద్‌  అన్‌రిజర్వుడ్‌    అన్‌రిజర్వుడ్‌(మహిళ) 

  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top