కులరాజకీయాలు పెచ్చుమీరాయి | Ram Madhav fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

కులరాజకీయాలు పెచ్చుమీరాయి

May 27 2018 4:09 AM | Updated on Aug 14 2018 11:26 AM

Ram Madhav fires On Chandrababu Naidu  - Sakshi

ప్రసంగిస్తున్న రాంమాధవ్‌. చిత్రంలో కన్నా

సాక్షి, గుంటూరు/గన్నవరం/మంగళగిరి రూరల్‌: రాష్ట్రంలో కుల రాజకీయాలు పెచ్చుమీరిపోయాయని.. వెంకటేశ్వర స్వామికి కూడా కులాన్ని ఆపాదించి వెంకన్నచౌదరిగా పిలుస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ మండిపడ్డారు. గుంటూరు నగరంలోని సిద్దార్థ గార్డెన్స్‌లో శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన రాంమాధవ్‌ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు కంటే కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాల్లో ఐదేళ్లు సీనియర్‌ అని చెప్పారు. కాంగ్రెస్‌పై ఎన్టీఆర్‌ పోరాటం చేస్తే.. చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌తో జత కట్టేందుకు తహతహలాడుతున్నారని దుయ్యబట్టారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేస్తానని చెప్పారు. కాగా, తాళ్లాయపాలెం పీఠాధిపతి శివస్వామి కన్నాకు ఆశీర్వచనం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement