ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌: నల్లు ఇంద్రసేనారెడ్డి | nallu indrasena reddy comments over kcr | Sakshi
Sakshi News home page

ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌: నల్లు ఇంద్రసేనారెడ్డి

Nov 7 2018 2:01 AM | Updated on Nov 7 2018 2:01 AM

nallu indrasena reddy comments over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తప్పుడు హామీలతో సీఎం కేసీఆర్‌ ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారని బీజీపీ నాయకు డు నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ను ఉద్యోగులు ప్రశ్నిస్తే వారిని తిట్టి పంపిస్తున్నారని, రైతుబంధు పథకం డబ్బులు రాలేదని అడిగితే అధికారులు దొంగ సాకులు చెప్తున్నారని విమర్శించారు. రైతుబంధు సొమ్ము బ్యాంకు ఖాతాల్లో వేయాల్సి ఉన్నా ఇప్పటివరకు వేయలేదని, ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవా? లేక దివాళా తీసిందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మిగులు రాష్ట్రం అని చెప్పే కేసీఆర్‌ ఎందుకు ఇప్పటివరకు నగ దు ఇవ్వలేదని ప్రశ్నించారు. పట్టాదారు పాస్‌ పుస్తకాలు ప్రింటింగ్‌ ప్రెస్‌లో పేరుకుపోయాయని, వారికి ఇచ్చే రూ.63 కోట్లు ఇవ్వలేదని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 15 సీట్లు కూడా రావడం అనుమానమేనన్నారు. ఆపద్ధర్మ సీఎం అయిన కేసీఆర్‌ గవర్నర్‌ దగ్గర రెండు గంటలపాటు ఎందుకు ఉన్నారని, ఏం మాట్లాడారో చెప్పాలన్నారు. ప్రభు త్వ అధికారులను తీసుకెళ్ళకుండా ఒక్కరే ఎందుకు వెళ్లారని, ఆ విషయాలు చెప్పకపోతే ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement