బాబు అడుగడుగునా అడ్డుపడ్డారు | MP Mithun Reddy Visit In Pileru Constituency | Sakshi
Sakshi News home page

బాబు అడుగడుగునా అడ్డుపడ్డారు

Jun 10 2018 5:16 PM | Updated on Aug 9 2018 8:35 PM

MP Mithun Reddy Visit In Pileru Constituency - Sakshi

సాక్షి, పీలేరు : ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన మహానేత వైస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని వాల్మికీపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లకు చంద్రబాబునాయుడు అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మైనార్టీలను వైఎస్సార్‌సీపీ దూరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, అందుకే వైఎస్‌ జగన్‌, బీజేపీతో కలిసాడని అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ బీజేపీతో కలవదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 100కు పైగా కుటుంబాలు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement