'కేటీఆర్‌ పార్లమెంటరీ పద్ధతిలోనే మాట్లాడారు'

Minister Jagadish Reddy Criticize Congress Leaders Over Jana Reddy Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌పై జానారెడ్డి వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాడ్లాడుతూ కేటీఆర్‌ పార్లమెంటరీ పద్ధతిలోనే మాట్లాడారని స్పష్టం చేశారు. సంస్కారం గురించి కాంగ్రెస్‌ నేతలు మాట్లాడటం విడ్డూరమని ఉందని ఆయన ఏద్దేవా చేశారు.

జానారెడ్డికి కాంగ్రెస్‌ నేతలు ఇవ్వని గౌరవాన్ని కేసీఆర్‌ ఇచ్చారన్నారు. మరో వైపు ప్రధాని మోదీపై కేసీఆర్‌ ఎలాంటి పరుష వ్యాఖ్యలు చేయలేదని.. బీజేపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని జగదీశ్‌ రెడ్డి మండిపడ్డారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top