మాది ప్రజల కోసం పనిచేసే పార్టీ.. అందుకే: ఈటల | Minister Etala Rajendar Talks In Press Meet At His Home | Sakshi
Sakshi News home page

త్వరలో చైర్మన్‌లను ప్రకటిస్తాం: మంత్రి ఈటల

Jan 25 2020 6:36 PM | Updated on Jan 25 2020 6:45 PM

Minister Etala Rajendar Talks In Press Meet At His Home - Sakshi

సాక్షి, హుజురాబాద్‌: జిల్లా పరిషత్‌లో ఏ విధమైన ఫలితాలు వచ్చాయో.. అవే మళ్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో పునరావృతమయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. హుజురాబాద్‌లో శనివారం ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ: మున్సిపల్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. గెలిచిన కౌన్సిలర్‌లకు, గెలిపించిన నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌ నిబ్బరంగా ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు భయానికి వణికిపోతున్నాయని విమర్శించారు. ప్రజల కోసం పని చేస్తున్న పార్టీ టీఆర్‌ఎస్‌ అని, అందుకే ప్రజలు అధికార పార్టీని గెలిపించారన్నారు. పార్టీలో నిర్ణయం తీసుకొని చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను త్వరలో ప్రకటిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement