‘టీడీపీ కాపులకు నమ్మక ద్రోహం చేసింది’ | Jakkampudi Raja Criticizes TDP For Cheating Kaapu Corporation | Sakshi
Sakshi News home page

‘టీడీపీ కాపులకు నమ్మక ద్రోహం చేసింది’

Oct 17 2019 7:55 PM | Updated on Oct 17 2019 8:11 PM

Jakkampudi Raja Criticizes TDP For Cheating Kaapu Corporation - Sakshi

సాక్షి, విజయవాడ : గత టీడీపీ ప్రభుత్వం కాపులకు నమ్మక ద్రోహం చేసిందని కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా విమర్శించారు. సంవత్సరానికి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి.. ఐదేళ్లలో పదిహేడు వందల కోట్లు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. విదేశి విద్య పథకంలో లబ్ధికోసం 400 మంది దరఖాస్తు చేసుకున్నారని, రెండు రోజులపాటు సర్టిఫెకేట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని తెలిపారు. విదేశి విద్యకు దరకాస్తు చేసుకున్న అర్హులైన కాపులందరికీ అవాకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కాపుల కోసం ఒక్క ఏడాదిలోనే రెండు వేల కోట్లు కేటాయించారని వెల్లడించారు. సీఎం జగన్‌ సూచనలతో కాపు సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులంలోని ప్రతి ఒక్కరికీ కాపు కార్పొరేషన్‌ న్యాయం చేస్తుందని జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement