నేను ఎక్కడికి పోను.. కాంగ్రెస్‌లోనే ఉంటా

సాక్షి, హైదరాబాద్ : తాను పార్టీ మారతానంటూ చాలా పుకార్లు వస్తున్నాయని, ఎక్కడికి పోనని కాంగ్రెస్‌లోనే ఉంటానని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. బుధవారం కాంగ్రెస్ ముఖ్యనేతలు దామోదర రాజనర్సింహ, కూన శ్రీశైలం గౌడ్, భిక్షపతి యాదవ్, డీకే అరుణ, రేవంత్ రెడ్డిలు మాజీ మంత్రి ముఖేష్ ఇంటిలో సమావేశమయ్యారు. అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఉంటే బలమే కదా అన్నారు.
టీడీపీ కూడా ఒక రాజకీయపార్టీ అని చెప్పారు. టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డీఎస్ కాంగ్రెస్‌లోకి రావడాన్ని ఆహ్వానిస్తామన్నారు. కాంగ్రెస్ సముద్రం లాంటిదని వ్యాఖ్యానించారు. ఎవరన్నా కాంగ్రెస్‌లోకి రావచ్చని అభిప్రాయపడ్డారు. పొత్తులు, సీట్లు అధిష్టానం నిర్ణయస్తుందని తేల్చిచెప్పారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి