టీడీపీని మేం బుజ్జగించం | Haribabu on TDP Ministers Resignation | Sakshi
Sakshi News home page

టీడీపీని మేం బుజ్జగించం

Mar 8 2018 6:20 PM | Updated on Aug 10 2018 8:46 PM

Haribabu on TDP Ministers Resignation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ కేంద్ర మంత్రుల రాజీనామాలపై ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వారిని ఎట్టి పరిస్థితుల్లో బుజ్జగించే ప్రయత్నం చెయ్యబోమని తెలిపారు.

ఎన్నికల సమయంలో ఇలాంటి నిర్ణయాలుంటాయని, వీటిపై చర్చలు జరపాలనుకోవట్లేదని అన్నారు. ఏపీకి బీజేపీ సహాయం చేయలేదనడం బాధాకరమని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు మూడున్నరేళ్లుగా బీజేపీ చేసిన సహాయం మరే రాష్ట్రానికి చేయలేదని, రాజీనామాలపై టీడీపీ వెనక్కి తగ్గుతుందని తాను అనుకోట్లేదని అన్నారు. ప్రత్యేక హోదాకు, పన్ను రాయితీలకు సంబంధం లేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement