ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి

Government should be responsible to the accident - Sakshi

కాంట్రాక్టర్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలి వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి

అల్గునూర్‌ (మానకొండూర్‌): రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌ సొరంగ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టా లని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌ చౌరస్తాలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అల్గునూర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఆవిష్కరించారు. మృతులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీమా కంపెనీలు ఇచ్చే పరిహారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.

ప్రమాదంపై అత్యున్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. బాధితు లకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్‌సీపీ వారికి అండగా ఉంటుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులన్నీ దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చలవేనని గట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ల కోసం ప్రాజెక్టులను రీ డిజైనింగ్‌ చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినిపల్లి శ్రీనివాస్‌రావు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కె.నగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top