ఏంటిది.. ఎమ్మెల్యే సారూ..?

funds wasted in malkajgiri leaders - Sakshi

నిధులు ఖర్చుచేయని ఎమ్మెల్యేలు

మూలుగుతున్న నిధులు

నాలుగేళ్లలో విడుదలైంది రూ.41.25 కోట్లు

ఖర్చుచేసింది రూ.22.35 కోట్లు

సాక్షి, మేడ్చల్‌ జిల్లా:  మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో అసెంబ్లీ సభ్యుల్లో కొందరు తమ నియోజకవర్గం అభివృద్ధి నిధులను ఖర్చు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల బ్యాంకు ఖాతాల్లో మూలుగుతున్నాయి.  అభివృద్ధి కోసం  ప్రభుత్వం రూ. కోట్లు కుమ్మరించినా.. వాటిని వినియోగించుకోవడంలో విఫలమవుతున్నారు. 2014–15నుం చి 2017–18 ఫిబ్రవరి వరకు దాదాపు నాలుగు సంవత్సరాల పూర్తి కావస్తున్నా నియోజకవర్గ అభివద్ధి కింద ఐదుగురు ఎమ్మెల్యేలకు మొత్తంగా  రూ. 41.25 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇందులో ఎమ్మెల్యేకు ఒక్కొక్కరికి 2014–16 వరకు రెండు సంవత్సరాలు  రూ.1.5 కోట్లు చోప్పున సీడీ పీ నిధులు రాగా, 2016–17 నుంచి రూ.3 కోట్లకు పెంచారు. అయితే.. పలువురు ప్ర జాప్రతినిధులు మాత్రం ఇప్పటివరకు పూర్తి స్థాయిలో నిధులను  నియోజక వర్గం ప్రజల అభివద్ధి కోసం ఖర్చు చేయకపోవటంతో బ్యాంకు ఖాతాల్లో మూలుగుతున్నాయి. 

అభివద్ధి ఖర్చు ఇదే
నియోజకవర్గ అభివృద్ధి నిధుల(సీడీపీ)లో భాగం గా ప్రతి ఎమ్మెల్యేకి రాష్ట్ర ప్రభుత్వం 2014–16 ఆర్థిక(రెండు) సంవత్సరాల్లో రూ. 3 కోట్లు విడుదల చేయగా, 2016–17 ఆర్థిక సంవత్సరంలోరూ. 3 కోట్ల అందజేయగా, 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.2.25 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. స్థానిక అవసరాలు, వివిధ అభివృద్ధి పనులను  గుర్తించి వీటిని ఖర్చు చేసే వెసులుబాటు ఎమ్మెల్యేలకు ఉంది. ఇందులో 50 శాతం నిధులకు సంబంధించిన పనులను ఎమ్మెల్యే  నేరుగా ఆమోదించే అధికారం ఉంది. మిగతా 50 శాతం నిధులు మాత్రం జిలా ఇన్‌ఛార్జి మంత్రి ద్వారా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాదాపు నాలుగు  సంవత్సరాలు  కావస్తున్నప్పటికిని,  విడుదలైన నిధుల్లో  సగం  కూడా ఖర్చు చేయకుండా సర్కారు ఖజానాలో ఉంచారు. 

నిధుల ఖర్చు రూ.22.35 కోట్లే..
మూడున్నర సంవత్సరాల్లో  మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో  రూ. 41.25 కోట్లు విడుదల కాగా.. ఇప్పటివరకు కేవలం రూ.22.35 కోట్లు మాత్రమే ఖర్చు చేసి 515 పనులు పూర్తిచేశారు. వాస్తవానికి గుర్తించిన  630 పనులు పూర్తి చేయాల్సి ఉన్నా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ప్రారంభించిన 115 అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారు.  జిల్లాలో  అసెంబ్లీ నియోజవర్గాల అభివద్ధి నిధుల వినియోగంలో కుత్బల్లాపూర్, మేడ్చల్, కూకట్‌పల్లి, ఉప్పల్‌  నియోజకవర్గాల ఎమ్మెల్యేలు  ముందువరుసలో ఉన్నారు. ఒక్కొక్క  ప్రభుత్వం సీడీపీ నిధులు  రూ.8.25 కోట్లు విడుదల చేయగా,   కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే  వివేకానందగౌడ్‌ తన నియోజకవర్గంలో 199 అభివృద్ధి పనులు చేపట్టి  రూ. 5.95 కోట్లు  నిధులు ఖర్చు చేసి జిల్లాలో మొదటి స్థానంలో నిలి చారు. ,కూకట్‌పల్లి ఎ మ్మెల్యే మాధవరం కృ ష్ణారావు నియోజకవర్గం లో 41 అభివృద్ధి పనులు చేపట్టి రూ. 4.58 కోట్లు లక్షలు ఖర్చు చేసి రెండో స్థానంలో నిలిచారు.

మేడ్చల్‌ ఎమ్మెలే మలిరెడ్డి సుధీర్‌రెడ్డి  నియోజకవర్గంలో 149  పను లకు రూ. 4.77కోట్లు  నిధులు  ఖర్చు పెట్టి మూడవ స్థానంలో నిలిచారు. ఉప్పల్‌ ఎమ్మెల్యే ప్రభాకర్‌ నియోజకవర్గంలో 73 పనులకు రూ.4.12 కోట్లు నిధులు ఖర్చు చేశారు.  మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి నియోజకవర్గంలో 53 అభివృద్ధి పనులకు రూ.2.93 కోట్లు లక్షలు ఖర్చు చేసి  జిల్లాలో చివరి స్థానంలో నిలిచారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top