దమ్ముంటే అరెస్టు చేయ్‌.. మోదీకి సవాల్‌!

Digvijaya Singh dares Narendra Modi to prosecute him over Accident comment - Sakshi

న్యూఢిల్లీ: పూల్వామా ఉగ్రవాద దాడి ఘటనను ‘ప్రమాదం’గా అభివర్ణించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి ఘాటుగా ట్వీట్‌ చేశారు. పూల్వామా ట్వీట్‌ నేపథ్యంలో దమ్ముంటే ప్రధాని మోదీ తనపై కేసు పెట్టి విచారణ జరపాలని సవాల్‌ విసిరారు. 

‘నేను చేసిన ట్వీట్‌తో నేను పాకిస్థాన్‌ మద్దతుదారుడినని, దేశద్రోహినని మీరు, మీ మంత్రులు ముద్ర వేస్తున్నాను. నేను ఈ ట్వీట్‌ను ఢిల్లీలో చేశాను. ఢిల్లీలో పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నారు. మీకు దమ్ముంటే నాపై కేసు పెట్టండి’ అని దిగ్విజయ్‌ ట్వీట్‌ చేశారు.

పూల్వామా ప్రమాదం తర్వాత భారత్‌ జరిపిన వైమానిక దాడులపై విదేశీ మీడియా అనుమానాలు వ్యక్తం చేసిందంటూ దిగ్విజయ్‌ మంగళవారం చేసిన ట్వీట్‌ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. 40మందికి పైగా జవాన్లను పొట్టనబెట్టుకున్న పూల్వామా ఉగ్రవాద దాడిని కేవలం ప్రమాదంగా అభివర్ణిస్తూ దిగ్విజయ్‌ ట్వీట్‌ చేశారంటూ ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు ఆయనపై మండిపడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top