కేసీఆర్‌ను ఓడించడం ద్వారా మోదీని దింపొచ్చు | cpi narayana slams kcr and narendra modi | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను ఓడించడం ద్వారా మోదీని దింపొచ్చు

Dec 4 2018 6:19 AM | Updated on Dec 4 2018 6:19 AM

cpi narayana slams kcr and narendra modi - Sakshi

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఓడించడం ద్వారా కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్‌ను ఓడించవచ్చని భావిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. బీజేపీ బారినుంచి దేశాన్ని రక్షించేందుకు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునేందుకు ఆ పార్టీ వ్యతిరేకశక్తులను ఏకతాటిపైకి తెచ్చే కృషి జరుగుతోందని ఆయన వెల్లడించారు. లోపాయికారీ ఒప్పందాన్ని కొనసాగిస్తూనే పైకిమాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న టీఆర్‌ఎస్‌–బీజేపీలది ‘‘ముద్దులాట–గుద్దులాట’’చందంగా ఉందని ఎద్దేవా చేశారు. మగ్దూమ్‌ భవన్‌లో పార్టీ నేతలు అజీజ్‌పాషా, పల్లావెంకటరెడ్డి, బాలమల్లేశ్‌లతో కలిసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఐదుశాతం కూడా అమలు కాలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమి–టీఆర్‌ఎస్‌ల మధ్యే ప్రత్యక్షపోరు నెలకొందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement