అవినీతి, చంద్రబాబు కవల పిల్లలు

Corruption and cm chandrababu naidu is twins - Sakshi

వైఎస్సార్‌ సీపీ నేతలు రాజా, చిట్టబ్బాయి ధ్వజం 

టీడీపీ నుంచి 200 మంది పార్టీలో చేరిక

అంబాజీపేట (పి.గన్నవరం): అవినీతి, చంద్రబాబు కవల పిల్లల్లాంటి వారని, అందుకే టీడీపీని ప్రజలు నమ్మడం లేదని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ధ్వజమెత్తారు. అంబాజీపేట మండలం వాకలగరువులో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి చినబాబు అధ్యక్షతన నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో పార్టీ సమావేశం బుధవారం జరిగింది. రాజా, చిట్టబ్బాయి మాట్లాడు తూ చంద్రబాబు గత ఎన్నికల్లో 650 హామీలు ప్రకటించి ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారన్నారు. నిరుద్యోగులకు భృతి కల్పిస్తానని మోసం చేశారన్నారు. చంద్రబాబు 43 నెలల్లో లక్ష కోట్ల రూపాయలు నిరుద్యోగులకు బాకీ పడ్డారన్నారు.

టీడీపీలో కింద స్థాయి నాయకుడి నుంచి సీఎం  వరకూ ఇసుక, మట్టి, దేవాలయాలు తదితరాలను దోచుకుతింటూ రాష్టాన్ని  అవినీతిలోకి నెట్టేశారని విమర్శించారు. అవినీతి ప్రభుత్వాన్ని ఓర్వలేక తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను సీఎం చేసేందుకు ప్రజలే స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. ప్రత్యే క హోదా వస్తే రాష్ట్రంలో పన్నుల భారం తగ్గడమే కాక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ప్రత్యేక హోదా లేని రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ఇతర రాష్ట్రాల పారిశ్రామికవేత్తలు వెనుకడుగు  వేస్తున్నారన్నారు. పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహ న్, కర్రి పాపారాయుడు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి మాట్లాడుతూ జగన్‌ను సీఎం చేసేం దుకు రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.

అనంతరం పార్టీ మండల కార్యదర్శి నాగవరపు నాగరాజు, గ్రామ శాఖ నాయకులు వాకపల్లి శ్రీనివాస్, చప్పిడి రా>జు, కేతా రాజు, పైడికొండల శ్రీనివాసరావుతో పాటు పలువురి సహకారంతో చిట్టిబాబు ఆధ్వర్యంలో టీడీపీ నుంచి సుమారు 200 మంది వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి నేతలు కండువాలు కప్పి ఆహ్వానించారు.  నాయకులు ఎం.ఎం.శెట్టి, పేరి శ్రీనివాస్, దొమ్మేటి సాయికృష్ణ, నీతిపూడి విలసిత మంగతాయారు, నేతల నాగరాజు, కొర్లపాటి కోటబాబు, అడ్డగళ్ళ వెంకట సాయిరాం, వాసంశెట్టి తాతాజీ, మైలా ఆనందరావు, చెల్లుబోయిన శ్రీనివాసరావు, నక్కా వెంకటేశ్వరరావు, కూనపరెడ్డి వెంకట్రావు, దొమ్మేటి వెంకటేశ్వరరావు, బూడిద వరలక్ష్మి, సుంకర రామకృష్ణ, జక్కంపూడి వాసు, పేరాబత్తుల చిన సుబ్బరాజు, జక్కంపూడి కిరన్, దంతులూరి శ్రీనివాసరాజు, ఎస్‌.కె.జాకీర్, వాసంశెట్టి వెంకన్న, దూనబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top