
నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు
సాక్షి, వనపర్తి : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు భ్రమల్లో ఉన్నారని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో 70 సీట్లు గెలుచుకుంటామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని ఆయన సోమవారమిక‍్కడ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ప్రాజెక్ట్‌లపై వేసిన తప్పుడు కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని హరీశ్ రావు హితవు పలికారు. రైతులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నికర జలాలలతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందిస్తామని, రైతులకు మరింత గిట్టుబాటు ధర కల్పిస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు.