సీఎం కేసీఆర్‌  హుజూర్‌నగర్‌ సభ రద్దు

CM KCR Cancelled Huzurnagar Public Meeting Due To Rain - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా, ఏవియేషన్‌ అనుమతి లేకపోవడంతో చివరి నిమిషంలో రద్దయింది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రంలో గురువారం టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ ఏర్పాటు చేయగా, పార్టీ అధినేత హోదాలో సీఎం కేసీఆర్‌ హాజరయ్యేలా షెడ్యూలు సిద్ధం చేశారు. అయితే గురువారం హుజూర్‌నగర్‌లో భారీ వర్షం కురుస్తుండటంతో..హెలిక్యాప్టర్‌కు ఏవియేషన్‌ విభాగం అనుమతివ్వలేదు.

సీఎం భద్రతను దృష్టిలో పెట్టుకుని హెలిక్యాప్టర్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని ఏవియేషన్‌ విభాగం డైరెక్టర్‌ వీఎన్‌ భరత్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. హెలిక్యాప్టర్‌కు అనుమతి లేకపోవడంతో సీఎం పర్యటన రద్దయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కాగా ఈ నెల 19తో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుండటంతో.. సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం ఉండే అవకాశం లేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top