‘చర్చకు బాబు రాకుంటే లోకేష్‌ను పంపండి’ | Chief Whip Gadikota Srikanth Reddy Critics Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘చర్చకు బాబు రాకుంటే లోకేష్‌ను పంపండి’

Jun 5 2020 2:36 PM | Updated on Jun 5 2020 3:16 PM

Chief Whip Gadikota Srikanth Reddy Critics Chandrababu Naidu - Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. అయిపోయిన పెళ్లికి బ్యాండ్ బాజా అన్నట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తన పాలన గొప్పగా ఉన్నట్టు బాబు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు పంచభూతాలను దోచుకున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. అమరావతి నుంచి ఢిల్లీ వరకు చంద్రబాబు హవాలా స్కాం నడిపారని ఆరోపించారు.

రాజధాని పేరుతో అమరావతిలో వేల కోట్లు కాజేశారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూసి చంద్రబాబు కళ్లు బైర్లుకమ్మాయని వ్యాఖ్యానించారు. సంక్షేమ కార్యక్రమాల అమలుపై కుప్పంలో చంద్రబాబుతో చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. బహిరంగ చర్చ కుప్పం నియోజకవర్గం నుంచే మొదలుపెడదామని తెలిపారు. చంద్రబాబు రాకుంటే లోకేష్‌ను బహిరంగ చర్చకు పంపాలని శ్రీకాంత్‌రెడ్డి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement