టీడీపీ వాళ్లే ఇసుక దొంగలు

మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శ
శృంగవరపుకోట రూరల్: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు ఇసుక దోపిడీతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గౌరీపురం వద్ద కృష్ణమహంతిపురం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన పెట్రోల్ బంకును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50శాతం పదవులు ఇస్తూ జీఓ తెచ్చామని, ఆ పదవుల్లో నియమించిన వారిని తొలగించే వీలులేకుండా చర్యలు కూడా తీసుకుంటున్నామన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి