'రాజే'రికం కొనసాగేనా?

BJP Trying To Win Rajasthan Elections - Sakshi

 మోదీపై కాదు.. వసుంధరపైనే ప్రజల వ్యతిరేకత

అధిగమించేందుకు కమలనాథుల విశ్వప్రయత్నం

రాజస్తాన్‌లో 25 ఏళ్లుగా ఏ పార్టీ వరసగా రెండోసారి అధికారాన్ని చేపట్టలేదు. తిరిగి అదే సంప్రదాయం పునరావృతమవుతుందనే విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటున్న వసుంధర రాజే సర్కార్‌ మళ్లీ అధికారం నిలబెట్టుకోవడం అంత సులభం కాదనే అంచనాలు కనబడుతున్నాయి. గత ఎన్నికల్లో అప్పటికే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడంతో బాగా కలిసొచ్చింది. కేవలం మోదీ ఇమేజ్‌ మీదే బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సారి కూడా మోదీ అంటే ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ.. వసుంధరా రాజే పరిపాలనే బీజేపీ పుట్టి ముంచేలా కనిపిస్తోంది. ఏబీపీ సీఓటర్‌ ఒపీనియన్‌ పోల్‌లో రాజే మళ్లీ సీఎం కావాలని కేవలం 24% మంది మాత్రమే కోరుకున్నారు. ఇక ఇండియాటుడే సర్వేలో 35% మంది రాజేకు జై కొట్టారు. ప్రజల్లో మాత్రమే కాదు పార్టీలో కూడా అంతర్గతంగా ఆమెపై అసమ్మతి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తామంటూ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బహిరంగంగానే వెల్లడిస్తున్న పరిస్థితులు ఆశ్చర్యపరుస్తున్నాయి.

ప్రభావితం చూపే అంశాలు
రోజురోజుకి పెరిగిపోతున్న నిరుద్యోగంతో యువత తీవ్ర అసంతృప్తితో ఉండడం ఎన్నికల్లో బాగా ప్రభావం చూపిస్తుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఎమ్మెస్‌ స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్లతో రైతన్నలు నిరసనలకు దిగుతూనే ఉన్నారు. రైతుల్లో అసంతృప్తిని గుర్తించిన రాజే ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వారిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేసింది. రూ.50 వేల వరకు రుణాలను మాఫీ చేసింది. ఈ చర్యతో 30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. ‘వసుంధరా సర్కార్‌ అన్ని రంగాల్లోనూ విఫలమైంది. అందుకే స్థానిక ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపీని ఓడించారు. కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలోకి వస్తుంది. నిజానికి బీజేపీ పరిపాలనలో వాస్తవంగా లబ్ధి పొందింది లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్య మాత్రమే. కాంగ్రెస్‌ పార్టీ ఈ సారి అమలు కాని హామీలేవీ ఇవ్వలేదు. పాజిటివ్‌ డెవలప్‌మెంట్‌ అన్న అంశాన్నే తీసుకొని ముందుకు వెళుతోంది. అదే పార్టీని విజయతీరాలకు చేరుస్తుంది’ అని రాజస్తాన్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

09-12-2018
Dec 09, 2018, 05:34 IST
మన్ననూర్‌ (అచ్చంపేట): పోలీసులు అత్యుత్సాహంతో చేసిన లాఠీచార్జిలో గాయపడిన ఓ గిరిజన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు....
09-12-2018
Dec 09, 2018, 05:24 IST
సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతు కావడంతో శుక్రవారం జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో లక్షలాది మంది ఓటుహక్కు...
09-12-2018
Dec 09, 2018, 05:16 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్న తీరు.. ప్రజా కూటమిపై ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు...
09-12-2018
Dec 09, 2018, 05:10 IST
సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో ‘కల్వకుంట్ల’ కుటుంబ పాలనకు కాలం చెల్లిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. అసెంబ్లీ...
09-12-2018
Dec 09, 2018, 04:51 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి 75 నుంచి 80 సీట్లలో గెలుస్తుందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌...
09-12-2018
Dec 09, 2018, 03:21 IST
సాక్షి, హైదరాబాద్‌: సామాజిక న్యాయం, ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు, సామాజిక తెలంగాణ ప్రధాన ఎజెండాగా సీపీఎం–బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌)...
09-12-2018
Dec 09, 2018, 03:15 IST
సాక్షి, హైదరాబాద్‌: కమలనాథుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో గణనీయమైన స్థానాల్లో గెలుపొంది సత్తా చాటుతామని ఆ పార్టీ నేతలు...
09-12-2018
Dec 09, 2018, 03:00 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు అప్రమత్తంగా ఉండాలని టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆ పార్టీ...
09-12-2018
Dec 09, 2018, 02:04 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 73.20% పోలింగ్‌ నమోదైంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం జరిగిన పోలింగ్‌కు...
09-12-2018
Dec 09, 2018, 02:01 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పీపుల్స్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు....
09-12-2018
Dec 09, 2018, 01:52 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత ఎన్నికల్లో కనీసం ఒక్క సీటైనా గెలిచి అసెంబ్లీలో కనీస ప్రాతినిధ్యం సాధించేందుకు సీపీఐ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌...
09-12-2018
Dec 09, 2018, 01:44 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్‌ ఘట్టం ముగియడంతో ప్రజాకూటమి నేతలు ఇప్పుడు లెక్కలు వేసే పనిలో పడ్డారు....
09-12-2018
Dec 09, 2018, 01:42 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని ఆ పార్టీ ముఖ్యనేత కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌...
09-12-2018
Dec 09, 2018, 01:38 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భారీగా బెట్టింగ్‌ జరుగుతోంది. పోలింగ్‌ సరళిపై వెలువడిన ఎగ్జిట్‌...
09-12-2018
Dec 09, 2018, 01:23 IST
ఏం చేస్తారో, ఎంత పంచుతారో తెలీదు.. నేను గెలవాలంతే! తన అనుచరులకు ఓ అభ్యర్థి ఆదేశం..అవతలి పార్టీ పంచినదానికి మరో వెయ్యి ఎక్కువే...
09-12-2018
Dec 09, 2018, 01:14 IST
శుక్రవారం పోలింగ్‌తో అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ప్రక్రియ చర   మాంకంలోకి వచ్చింది. ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తే...
08-12-2018
Dec 08, 2018, 22:06 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీకి శుక్రవారం జరిగిన ఎన్నికల పోలింగ్‌ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన...
08-12-2018
Dec 08, 2018, 21:10 IST
సాక్షి, రామగుండం(పెద్దపల్లి): తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ ముగిసినా.. నాయకుల మధ్య మాటల యుద్దం ఆగటం లేదు. విజయంపై ఎవరికివారు ధీమా...
08-12-2018
Dec 08, 2018, 20:05 IST
ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు కాంగ్రెస్‌కు స్వల్పసంతోషాన్ని కలిగించేవి.. ఎన్నికల ఫలితాల రోజు కాంగ్రెస్‌కు రిక్త హస్తమే..
08-12-2018
Dec 08, 2018, 19:46 IST
కూకట్‌పల్లి నియోజకవర్గంలో చంద్రబాబు వ్యూహం ఫలించలేదు.
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top