టీడీపీని భూస్థాపితం చేద్దాం | Sakshi
Sakshi News home page

టీడీపీని భూస్థాపితం చేద్దాం

Published Mon, Feb 25 2019 1:25 PM

Balineni Srinivas Reddy in Ravali Jagan Kavali jagan - Sakshi

ఒంగోలు సిటీ: అన్యాయాలకు, అరాచకాలకు, అవినీతికి తెలుగుదేశం పాలన నిలయమైందని రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ పాలనను భూస్థాపితం చేద్దామని పిలుపునిచ్చారు. ఆదివారం ఒంగోలు 14వ డివిజన్‌లోరావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమంలో నవరత్నాలపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ చంద్రబాబు ఓట్ల కొనుగోలు రాజకీయాలను చేస్తున్నారని విమర్శించారు. దండిగా డబ్బును వదిలి అడ్డదారుల్లో ఓట్లను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆదమరిస్తే మళ్లీ ఐదేళ్లు చంద్రబాబు అరాచకాలు, అవినీతి, అన్యాయాలు, మోసాలను భరించాల్సి వస్తుందని వివరించారు. ఓటర్లు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబుకు శాశ్వత విశ్రాంతి ఇద్దాం..
మోసాలకు చిరునామా అయిన చంద్రబాబును ఈ ఎన్నికల ద్వారా శాశ్వత విశ్రాంతి ఇవ్వాలని బాలినేని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానిని పూర్తిగా అమలు చేయలేదన్నారు. గత ఎన్నికల్లో 600 హామీలను ఇచ్చి ప్రజల ఓట్లను కొల్లగొట్టారని, ఎన్నికలయ్యాక డిజిటల్‌ అభివృద్ధి చూపిస్తూ ప్రజల్ని మోసగించారని అన్నారు. ఎక్కడా అభివృద్ధి ఛాయలు లేవన్నారు. అంతా ఆర్భాటపు ప్రచారంతో, జనం డబ్బు దుబారాతో నాలుగున్నర ఏళ్ల కాలాన్ని గడిపారని విమర్శించారు. యథారాజా తథాప్రజ అన్నట్లుగా చంద్రబాబు అరాయించుకోని అవినీతిని ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు అందిపుచ్చుకున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలన్నారు. ఓటుతో నిజాయితీని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు తెలిసిన రాజకీయాలు ఓట్లను కొనుగోలు చేయడమే అన్నారు. మానవత్వంలేని ఇలాంటి టీడీపీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వసనీయ రాజకీయాలకు జీవం పోయాలన్నారు. ఎన్నికల్లో తాయిలను ఇచ్చి ఓట్లను దోచుకోవాలని జనం డబ్బుతో పథకాలను ప్రకటిస్తున్నారని అన్నారు. ఇందులో ఏ ఒక్కదానిని పూర్తిగా ఇచ్చే పరిస్థితి ఉండదని అన్నారు.

వైఎస్సార్‌ సీపీలోనే బీసీలకు ప్రాధాన్యం..
ఎన్నికల్లో ఓటర్లను పక్కదారి పట్టిస్తున్నారని ఈ కుట్రను గుర్తించాలని బాలినేని చెప్పారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని గిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. ఎవరు నిజంగా అభివృద్ధి కాముకులో తెలుసుకొని ఓట్లు వేయాలన్నారు. నాలుగున్నర ఏళ్ల పాటు అమరావతి అంటూ ప్రజల్ని భ్రమల్లో ఉంచారన్నారు. తాబేదార్లకు చౌకగా భూములను కట్టబెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను కొల్లగొట్టారన్నారు. సంక్షేమ పథకాలంటూ ఊదరగొడ్తున్నారన్నారు. ప్రజల్ని రకరకాలుగా మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తరిమేందుకు ప్రజలు కదలాలని అన్నారు. టీడీపీ కులాలను రెచ్చగొడ్తుందన్నారు. ఎన్నికల్లో ప్రయోనం పొందాలని కుట్రలను పన్నుతుందని అన్నారు. వైఎస్సార్‌సీపీ ఒక్కటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు తగిన రాజకీయ ప్రాధాన్యం ఇవ్వనుందని అన్నారు. బీసీ డిక్లరేషన్‌ ద్వారా వెనుకబడిన వర్గాలకు ఆర్ధికంగా చేయూతనివ్వడానికి, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడానికి చేస్తున్న కృషిని ప్రస్తావించారు. రాజకీయాలంటే ఈసడించుకొనేట్లు చేసిన టీడీపీని నామరూపాల్లేకుండా చేసి విశ్వసనీయతను బతికించాలని కోరారు. ఒంగోలు నగరంలో జరిగిన అభివృద్ధిలో ఎవరి పాత్ర ఏమిటనేది ఆలోచించి ఓటెయ్యాలని అన్నారు. డివిజన్‌లోని గడప గడపకు తిరిగి ప్రచారం చేశారు. 14వ డివిజన్‌ అధ్యక్షుడు చావలి శివప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు, డివిజన్‌ నాయకులు ఎండీ ఇమ్రాన్, శ్రీకాంత్, ఉంగరాల శ్రీను, టి.వెంకటేష్, గోళ్ల బలికుమార్, కొంపల్లి విష్ణు, వరదా నాని, టి.సుధ, వాసు, నిర్మల, పీడీసీసీబీ మాజీ ఛైర్మన్‌ ఈదర మోహన్‌బాబు, నాయకులు వై.వెంకటేశ్వరరావు, కేవీ రమణారెడ్డి, పులుగు అక్కిరెడ్డి, కటారి శ«ంకర్, గంటా రామానాయుడు, అంజిరెడ్డి, సునీల్, మహిళా నాయకులు గంగాడ సుజాత, బైరెడ్డి అరుణ, పోకల అనురాధ, పల్లా అనురాధ, బి.రమణమ్మ, బడుగు ఇందిర, కావూరి సుశీల పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement