1593 మంది అనర్హులు!

election commission disqualified sarpanches - Sakshi

ఎన్నికల్లో పోటీపడి లెక్కలు చూపని ఫలితం

పదవి కోల్పోనున్న ఓ సర్పంచ్, 168 మంది వార్డుసభ్యులు

ఆదేశాలు జారీచేసిన జిల్లా పంచాయతీ అధికారి

పెద్దపల్లిరూరల్‌: గత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ సిన అభ్యర్థుల్లో 1593 మందిపై అనర్హత వేటు పడింది. జిల్లాలోని 14 మండలాలలో 208 గ్రామపంచాయతీలుండగా 2070 వార్డులున్నాయి. వీటికి నిర్వహించిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు లెక్కలు చూపలేదన్న కారణంతో 1593 మందికి ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వచ్చే మూడేళ్లపాటు జరిగే ఏఎన్నికలలోనూ పోటీచేసే అవకాశముండదని ఆ నోటీసుల్లో పేర్కొంది.

పదవి పోగొట్టుకున్న సర్పంచ్‌
సుల్తానాబాద్‌ మండలం పూసాల గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన లంక శంకర్‌ ఖర్చుల వివరాలు ఎన్నికల సంఘం అధికారులకు సమర్పించలేదు. ఈ కారణంగా సర్పంచ్‌ పదవికి అనర్హుడిగా పేర్కొంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. వార్డు సభ్యులుగా ఎన్నికైన జిల్లాలోని వివిధ పంచాయతీలకు చెందిన 168 మంది సభ్యులు ఖర్చుల వివరాలు చూపని కారణంగా వార్డుసభ్యుని పదవులు కోల్పోనున్నారు.  

Read latest Peddapalli News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top