వెండితెర చంద్రునికి నివాళి


సామాన్య మధ్యతరగతి కుటుంబానికి ఇంటి పెద్ద బాధ్యతలను నెత్తిన వేసుకున్న ఒక అవివాహిత యువతి మనోగతాన్ని, త్యాగశీల తను, సంసారం కోసం ఆమె పడే తపన, ఆవేదనలను సజీవ చిత్రంగా మలచి... ఒకవంక ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తూనే, మరోవంక సునిశిత హాస్యంతో గిలిగింతలు పెట్టిన ‘అంతులేని కథ’ కర్త బాల చందర్. ఆచార వ్యవహారాల అడ్డంకులను అధిగమించి, మానవత్వం పునాదిగా సమాజ పునర్నిర్మాణానికి నడుం బిగించాలని యువతకు మేలుకొలపడానికై ‘రుద్రవీణ’ను మీటిన ప్రగతిశీలి బాలచందర్.

 

 నిరుద్యోగం యువతను ఎలా రగిలేట్టు చేస్తుందో, ఆకలి మంటల మధ్య ఆదర్శాల కోసం ఆర్తితో అలమటించేట్టు చేస్తుందో చెప్పి ‘ఆకలి  రాజ్యం’కు నిలువెత్తు అద్దం పట్టిన అసాధారణ ప్రతిభాశాలి బాలచం దర్. సామాజిక వాస్తవికతను గొప్ప కళాఖండాలుగానే గాక, జనరంజ కంగా రూపొందించడం ద్వారానే కళ సామాజిక ప్రయోజన సాధనం కాగలదని నిరూపించిన అతి అరుదైన చలనచిత్ర దర్శకుడు బాలచం దర్. ప్రయోగాత్మకతే ఊపిరిగా కళా తపస్సు చేసి, మట్టిలోంచి మాణి క్యాలను వెలికి తీసి, గొప్ప కళాకారులుగా మార్చిన అపర కళాబ్రహ్మ ఇక లేరన్న వార్త దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు, ప్రేక్షకకులకే కాదు భారత సినీ పరిశ్రమకే తీరనిలోటు. ఆయనకు అశ్రునివాళులు.  

- శొంటి విశ్వనాథం  హైదరాబాద్

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top