గ్రహం అనుగ్రహం | Graham Anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం

Jan 6 2015 3:04 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం - Sakshi

గ్రహం అనుగ్రహం

శ్రీజయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి బ.పాడ్యమి ఉ.10.35 వరకు

 శ్రీజయనామ సంవత్సరం,  దక్షిణాయనం, హేమంత ఋతువు
 పుష్య మాసం, తిథి బ.పాడ్యమి ఉ.10.35 వరకు
 తదుపరి విదియ
 నక్షత్రం పునర్వసు ఉ.10.51 వరకు
 తదుపరి పుష్యమి
 వర్జ్యం రా.7.30 నుంచి 9.14 వరకు
 దుర్ముహూర్తం ఉ.8.47నుంచి 9.37 వరకు
 తదుపరి రా.10.47 నుంచి 11.37 వరకు

సూర్యోదయం:    6.36  సూర్యాస్తమయం:     5.35
 రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
 యమగండం: ఉ.9.00 నుంచి  10.30 వరకు

 

భవిష్యం
 
మేషం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.

 వృషభం: ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు.

కర్కాటకం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. పనుల్లో విజయం. శుభవార్తలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

సింహం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి.
 
కన్య: దూరపు బంధువులను కలుసుకుంటారు. సంఘంలో ఆదరణ. విందువినోదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహాయం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
 
తుల: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి.
 
వృశ్చికం: రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.
 
ధనుస్సు: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.
 
మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థికాభివృద్ధి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
 
కుంభం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో  పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆస్తిలాభం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.
 
మీనం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు అధికమవుతాయి.
 - సింహంభట్ల సుబ్బారావు

Advertisement
 
Advertisement
Advertisement