ఈవెంట్ | event | Sakshi
Sakshi News home page

ఈవెంట్

Aug 2 2015 3:46 AM | Updated on Sep 3 2017 6:35 AM

మ్యాజిక్ సాయంత్రం..ఛాయ’ ఆధ్వర్యంలో ఆగస్టు 2న సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ స్టడీ సర్కిల్, దోమలగూడ, హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో, ‘మార్క్వెజ్ మ్యాజిక్ రియలిజం ఎందుకు?’ అంశంపై కథకుడు ‘టైటానిక్’ సురేశ్ ప్రసంగించనున్నారు.

 మ్యాజిక్ సాయంత్రం


 ‘ఛాయ’ ఆధ్వర్యంలో ఆగస్టు 2న సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ స్టడీ సర్కిల్, దోమలగూడ, హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో, ‘మార్క్వెజ్ మ్యాజిక్ రియలిజం ఎందుకు?’ అంశంపై కథకుడు ‘టైటానిక్’ సురేశ్ ప్రసంగించనున్నారు.


 చేరా ప్రథమ వర్ధంతి సభ


 భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు భౌతికంగా దూరమై జూలై 24తో ఏడాది. జూలై 26న ఏర్పాటు చేసిన ప్రథమ వర్ధంతి సభ చేరాకు ఆప్తుడైన చలసాని ప్రసాద్ జూలై 25న మరణించడంతో వాయిదా పడింది. తిరిగి ఆ సభ నేడు సాయంత్రం 4 గంటలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ క్యాంపస్‌లోని అడిక్‌మెట్ రోడ్డులో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ భవనం పక్కన ఉన్న మెకాస్టర్ ఆడిటోరియంలో జరగనుంది. చేరా మిత్రులు వరవరరావు, ఓల్గా, కాత్యాయనీ విద్మహే, శివారెడ్డి, దేవిప్రియ, శిఖామణి, యాకూబ్ తదితరులు తమ జ్ఞాపకాలను పంచుకుంటారు. చేరా సంస్మరణ వ్యాసాల సంకలనం ఆవిష్కరణ కూడా జరుగుతుంది. వివరాలకు చేకూరి సంధ్యను 9959060392 నంబర్లో సంప్రదించవచ్చు.
 
 ‘మో’ స్మారకోపన్యాసం


 ‘సాహితీ మిత్రులు’ ఆధ్వర్యంలో ఆగస్టు 3న సాయంత్రం 6 గంటలకు మధుమాలక్ష్మి ఛాంబర్స్, మధు చౌక్, మొగల్రాజపురం, విజయవాడలో జరిగే కార్యక్రమంలో, నగ్నముని, కొప్పర్తి ‘మో’ స్మారకోపన్యాసం చేయనున్నారు.
 
 దేశభక్తి గీతాల పోటీ


 దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారు దేశభక్తి గీతాల పోటీ నిర్వహిస్తున్నారు. బహుమతుల మొత్తం విలువ పది వేల రూపాయలు. గీతాల్ని 19-457/1, రాంనగర్, మంచిర్యాల-504208కుగానీ, patriotswelfaresociety@gmail.comకుగానీ పంపవచ్చు. చివరి తేది: ఆగస్టు 5. వివరాలకు అధ్యక్షుడు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి ఫోన్: 9440383277
 
 ‘గురసం’ పురస్కారం


 2014లో ప్రచురించిన కవిత, కథా సంపుటులకు వేర్వేరుగా గుంటూరు జిల్లా రచయితల సంఘం పురస్కారాలు ప్రదానం చేయనుందనీ, ఎంపికైన కవి/కథకుడికి 5000 నగదు, సత్కారం ఉంటాయనీ, ఆగస్టు 30లోపు మూడు ప్రతుల్ని దిగువ చిరునామాకు పంపాలనీ, అధ్యక్షుడు సోమేపల్లి వెంకటసుబ్బయ్య కోరుతున్నారు: సయ్యద్ జానీ బాషా, కేరాఫ్ వరమ్మ, 9-92-29, దేవిరెడ్డి రెసిడెన్సీ ఎదురు, 4వ లైను, దేవాపురం, గుంటూరు-522002; ఫోన్:9491336488


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement