వైఎస్సార్‌సీపీ సింగపూర్ నూతన కార్యవర్గ భేటీ

Ysrcp NRI Singpore Wing New team meets in Amaravathi Restaurant - Sakshi

సాక్షి, సింగపూర్‌ : వైఎస్సార్‌సీపీ సింగపూర్ ఎన్ఆర్ఐ వింగ్ కన్వీనర్‌లు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, దక్కట జయప్రకాష్, వత్సవాయి పృధ్వీరాజ్‌ల అధ్యక్షతన నూతన కార్యవర్గం సమావేశమైంది. సింగపూర్‌లోని  లిటిల్ ఇండియా ప్రాంతంలోని అమరావతి రెస్టారెంట్లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి 100  మందికి పైగా పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్రతో ప్రజలకు మరింత చేరువ అవుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్ఐ వింగ్‌ నేతలు అన్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ సాగుతున్న ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వైఎస్‌ జగన్‌ వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని, వైఎస్సార్‌సీపీ మాత్రమే ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటాలు చేస్తుందన్నారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తామంతా సింగపూర్ నుంచి వచ్చి పార్టీ కోసం తమవంతుగా పూర్తి సహాయసహకారాలు అందించి, పార్టీ గెలుపు కొరకు కష్టపడతామని ఎన్‌ఆర్‌ఐలు ప్రతిజ్ఞ చేశారు. 2000 మందికి పైగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సింగపూర్ లో నివసిస్తున్నారని, తామంతా కలిసి 2019 ఎన్నికలకు తమ సంపూర్ణ మద్దతు ప్రత్యక్షంగా అందిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అవినీతిని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా చేస్తామని చెప్పారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలన్న దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయం, తిరిగి వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం అవుతుందని సింగపూర్ ఎన్ఆర్ఐలు పేర్కొన్నారు.

పార్టీ ముఖ్యనేతలతో చర్చించి త్వరలోనే ఎన్‌ఆర్‌ఐ మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ ప్రారంభింస్తామన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకువచ్చి, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని సీఎం చేసేంత వరకు అహర్నిషలు కష్టపడతామని చెప్పారు. ఈ సందర్భంగా జోహార్ వైఎస్ఆర్ జై జగనన్న నినాదాలతో సభ దద్దరిల్లింది. నూతన కార్యవర్గ సమావేశం రోజునే సింగపూర్ లో నివసిస్తున్న రామకృష్ణ (కొండా) ముసుకు సత్యనారాయణ రెడ్డి , పవన్ కుమార్ , బాబులు పార్టీలో చేరారు. వారిని వైఎస్సార్ సీపీ పార్టీ కండువాతో సింగపూర్ కన్వీనర్ లు పార్టీలోకి ఆహ్వానించారు. తమపై ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించి వైఎస్సార్‌సీపీ అభ్యున్నతికి పాటుపడే అవకాశం కల్పించిన వైఎస్‌ జగన్‌, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ రెడ్డికి సింగపూర్ ఎన్ఆర్ఐ వింగ్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సింగపూర్ ఎన్ఆర్ఐ వింగ్ కన్వీనర్లు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, దక్కట జయప్రకాష్, వత్సవాయి పృధ్వీరాజ్, సెక్రెటరీలు మరక మహేశ్వరరెడ్డి, గుంటి రామ్ మల్లయ్య, అలినేని సతీష్ రావు, చల్లబోయిన లక్ష్మీపతి, పడాల వీర్ రెడ్డి, తిప్పల ధుర్యోధన్, జి. కృష్ణారెడ్డి, బీఎస్ రాజు, సుధా లక్ష్మీరెడ్డి, లక్ష్మీనరసింహారెడ్డి, ట్రెజరర్ ఎన్ వేణుగోపాల రెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంటర్స్ దిల్లి వినయ్ కుమార్, వెండ్ర శ్రీమురళి, పాటి అంజిబాబు, అరిగెల శ్రీనివాసరావు, మిత్తన చిన్న అబ్బాయి, కందుల శివమోహన్ రెడ్డి, చల్లబోయిన వీర వెంకట శివ నాగరాజు, గొల్లపల్లి లింగారెడ్డి, నమ్మితేజ వెంకట లక్ష్మీప్రసన్న కుమార్, తమనంపూడి మోహన్ శంకర్, రాజారపు దేవేంద్ర, సిరిగిరెడ్డి అంకాలరెడ్డి, పసుపులేటి సందీప్, గార్లపాటి ప్రసాద్, నీలమ్మగాలి సింహాచలరెడ్డి, యాపర్ల సుదీప్, ఉడుముల ఆంజనేయ రెడ్డి, గుడిపల్లి సురేష్ బాబు, సిరిపురపు హరిరావు, సంకే శ్రీనివాసరావు, వెన్న వీరారెడ్డి, భూమ్ రాజ్ రుద్ర, చంద్ర సుబ్బిరెడ్డి, సుధా రామమోహన్ రెడ్డి, రాపేటి జనార్ధన్ రావు సోషల్ మీడియా టీమ్ సభ్యులు పిల్లి సంతోష్ కుమార్ రెడ్డి, నక్కా దొరబాబు, దువ్వూరు మురళీకృష్ణ, నయాబ్ రసూల్, దుగసాని సంజయ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top