టిపాడ్‌ ఆధ్యర్యంలో ఘనంగా వనభోజనాలు

TPAD Conduct Vanabhojanalu Event In Frisco - Sakshi

అమెరికాలోని తెలంగాణ పీపుల్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టిపాడ్)  వనభోజనాలు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫ్రిస్కోలోని హిడెన్ కోవ్ పార్కులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మొదటగా శ్రీకృష్ణ, లక్ష్మీదేవి విగ్రహాలకు పూజలు నిర్వహించారు. పిల్లలతో కలిసి అంత్యాక్షరి, గేమ్స్‌‌, మ్యూజిక్‌ మస్తీలతో వనభోజనాల కార్యక్రమం సందడిగా సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిని నేటి తరానికి తెలియజేయడానికే ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ వంటకాలు, ఆట పాటలతో వనభోజనాల కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది.

టిపాడ్‌ ప్రెసిడెంట్‌ శ్రీని గంగాధర, బీఓటీ చైర్మన్‌ శారద సింగిరెడ్డి, శ్రీని వేముల, జయ తెలకలపల్లి, ఇందూ పంచర్పుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. టిపాడ్‌ సభ్యులు రఘువీర్‌ బండారు, జయకిరణ్‌ మండది, ఉపేందర్‌ తెలుగు, అజయ్‌ రెడ్డి, రావు కల్వల, రాజ్‌వర్ధన్‌ గొంది, మహెందర్‌ కామిరెడ్డి, పవన్‌ కుమార్‌ గంగాధర, మనోహర్‌ కాసగాని, అశోక్‌ కొండల, రామ్‌ ఆన్నాడి, మాధవి సుంకిరెడ్డి, సుధాకర్‌ కలసాని, ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ సభ్యులు రమణ లష్కర్‌, కరణ్‌ పోరెడ్డి, చంద్ర పోలీస్‌, సత్య పెర్కారి, రవికాంత్‌ మామిడి, రూప కన్నయ్యగారి, లింగారెడ్డి అల్వా, సురెందర్‌ చింతల, ఆడెపు రోజా, శరత్‌ ఎర్రమ్‌, మధుమతి, మాధవి లోకిరెడ్డి, దీప్తి సూర్యదేవర, శంకర్‌ పరిమల్‌, వేణు ఉప్పాల, సతీష్‌ నాగిళ్ల, కళ్యాణి తడిమెటి, లక్ష్మీ పోరెడ్డి, పల్లవి తోటకూర, రోహిత్‌ నరిమేటి, అనూష వనం, నితిన్‌ చంద్ర, శిరిష్‌ గోనె, మాధవి ఓంకార్‌, అపర్ణ సింగిరెడ్డి, కామేశ్వరి దివకర్ల, కవిత బ్రహ్మదేవర, అనురాధ మేకల, సునిత, నితిన్‌ కొర్వి, శశిరెడ్డి కర్రి, మంజుల తొడుపునూరి, మాధవి ఓంకార్‌, సుగత్రి గూడూరు, మాధవి మెంటా, లావణ్య యారాకల, ధనలక్ష్మీ రావుల, మంజుల రెడ్డి ముప్పిడి, శాంతి నూతి, శ్రీనివాస్‌ కోటికంటి తదితరులు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top