డాలస్ గాంధీ విగ్రహాన్ని సందర్శించిన సినీ ప్రముఖులు

Telugu Cine Celebrities Visits Dallas Mahatma Gandhi Memorial - Sakshi

సాక్షి, డాలస్ : డాలస్‌లోని గాంధీ విగ్రహాన్ని పలువురు తెలుగు సినీ ప్రముఖులు సందర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న సుప్రసిద్ధ దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి, ప్రముఖ సినీ గేయ రచయితలు రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సిరా శ్రీ, కరాటే మార్షల్‌ ఆర్ట్స్‌లో బంగారు పతక విజేత చేరుపల్లి వివేక్ తేజలు డాలస్‌లోని భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించి, అక్కడ పుష్పగుచ్చాలు ఉంచి ఘన నివాళి అర్పించారు. 18 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న సుందరమైన పార్కులో ఈ గాంధీ మెమోరియల్‌ ఏర్పాటై ఉంది. గాంధీ మెమోరియల్‌ ఏర్పాటులో ప్రముఖ పాత్ర వహించిన ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర కృషిని వారు అభినందించారు. ఎన్నో కార్యక్రమాలతో తీరిక లేకున్నా ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి గాంధీ స్మారకస్థలిని సందర్శించిన వీరందరికీ చైర్మన్ డా. ప్రసాద్ తోటకూర మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డు సభ్యుల తరపున  కృతజ్ఞతలు తెలియజేశారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top