దుబాయికి ఈ సామగ్రి తీసుకెళ్లడం నిషేధం

గల్ఫ్ డెస్క్: దుబాయి ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణించేవారు తమ లగేజీలో కొన్ని రకాల వస్తువులను తీసుకపోవడంపై అక్కడి పోలీసులు నిషేధం విధించారు. ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూ.. తాము నిషేధించిన సామగ్రి వివరాలను దుబాయి పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేశారు. స్మార్ట్ బ్యాలెన్స్ వీల్స్(హోవర్ బోర్డ్స్ అని కూడా పిలుస్తారు), రసాయనాలు(కెమికల్స్), మెటాలిక్ ఐటెమ్స్ (పెద్ద సైజు కలిగినవి), కార్ల స్పేర్ పార్ట్స్, అన్ని రకాల గ్యాస్ సిలిండర్లు, బ్యాటరీలు, టార్చ్‌లైట్లు, పేలుడుకు సంబంధించిన లిక్విడ్‌లు, అలాగే పేలుడుతో సంబంధం లేకున్నా అధిక మోతాదులో ఉన్న లిక్విడ్‌లు, ఇ సిగరెట్స్, పవర్ బ్యాంక్స్‌ను లగేజీల్లో తీసుకెళ్లడం నిషేధం.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి