‘ఫాతిమా’ విద్యార్థులకు న్యాయం చేయండి | yv subba reddy about fatima college students problems | Sakshi
Sakshi News home page

‘ఫాతిమా’ విద్యార్థులకు న్యాయం చేయండి

Jan 5 2018 3:04 AM | Updated on Jan 5 2018 3:04 AM

yv subba reddy about fatima college students problems - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం, ఫాతిమా మెడికల్‌ కళాశాల యాజమాన్యం తప్పు వల్ల అడ్మిషన్లు కోల్పోయి రోడ్డున పడ్డ 100 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరోసారి కోరారు.

గురవారం కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలసిన సుబ్బారెడ్డి.. అడ్మిషన్లు కోల్పోయిన 100 మంది విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో సీట్లు సర్దుబాటు చేసేందు వీలుగా ప్రత్యేక ఆర్డినెన్స్‌ జారీ చేసి 100 సూపర్‌న్యూమరరీ ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదే విధమైన ఆర్డినెన్స్‌ ద్వారా గతంలో కేరళ, పాండిచ్చేరిలో విద్యార్థులకు సీట్లు సర్దుబాటు చేసిన విషయాన్ని సుబ్బారెడ్డి ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. వీలైతే మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను ఒప్పించి ఫాతిమా కళాశాలకు 100 సీట్లు అదనంగా కేటాయించేలా సిఫార్సు చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement