స్నేహితుడి భార్యపై సామూహిక అత్యాచారం | youth convicted for gangraping friends wife | Sakshi
Sakshi News home page

స్నేహితుడి భార్యపై సామూహిక అత్యాచారం

Oct 3 2013 4:33 PM | Updated on Sep 1 2017 11:18 PM

జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్తే భార్య పాలిట కిరాతకుడిగా మారాడు. డబ్బుల కోసం తన స్నేహితులతో భార్యపై అత్యాచారం చేయించాడు.

 జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్తే తన భార్య పాలిట కిరాతకుడిగా మారాడు. డబ్బుల కోసం తన స్నేహితులతో భార్యపై అత్యాచారం చేయించాడు. ఈ కేసులో భర్తతో సహా ఐదుగురి నిందితులకు ఢిల్లీ కోర్టు పదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది.

ఢిల్లీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్లో సురేష్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలుతో కలసి నివసిస్తున్నాడు. గతేడాది జూలై 9న తన స్నేహితులకు ఇంట్లో మద్యం పార్టీ ఇచ్చాడు. తన స్నేహితుల వద్ద డబ్బు తీసుకున్నానని, వారి కోరిక తీర్చాల్సిందిగా సురేష్ తన భార్యకు చెప్పాడు. ఆమె  తిరస్కరించడంతో కొట్టి గదిలో బంధించాడు. అనంతరం అతని స్నేహితులు ఆమెపై సామూహికంగా అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారించారు. నిందితులు నేరం చేసినట్టు రుజువుకావడంతో కోర్టు శిక్ష విధించింది. నిందితుల్లో ముగ్గురు మైనర్లున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement