మహిళపై లాయర్, కానిస్టేబుల్ అత్యాచారం | Woman raped by lawyer, constable in uttar pradesh | Sakshi
Sakshi News home page

మహిళపై లాయర్, కానిస్టేబుల్ అత్యాచారం

Jul 18 2014 12:40 PM | Updated on Mar 19 2019 5:52 PM

మహిళపై లాయర్, కానిస్టేబుల్ అత్యాచారం - Sakshi

మహిళపై లాయర్, కానిస్టేబుల్ అత్యాచారం

ఉత్తరప్రదేశ్లో అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. మహిళలకు రక్షణ ఇవ్వాల్సిన అధికారులే భక్షకులుగా మారుతున్నారు.

లక్నో : ఉత్తరప్రదేశ్లో అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. మహిళలకు రక్షణ ఇవ్వాల్సిన అధికారులే భక్షకులుగా మారుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని భదోహీలో ఓ మహిళపై న్యాయవాది, కానిస్టేబుల్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్య. న్యాయవాది జై ప్రకాష్ యాదవ్, కానిస్టేబుల్ రామ్ ఆశిష్ సింగ్ లు ఈ ఘటనకు పాల్పడినట్లు ఏఎస్పీ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై జ్ఞాన్ పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. న్యాయవాది జై ప్రకాష్ యాదవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న కానిస్టేబుల్ కోసం గాలిస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement